కరోనా వల్ల ఏర్పడ్డ ఎకనామిక్ క్రైసిస్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మహమ్మారి పనులు చేసుకుని బతికే వారి సామర్థ్యాన్ని దెబ్బతిస్తోందని అన్నారు.
“ ఈ వైరస్ మనక వార్నింగ్ ఇస్తుంది. కేవలం కలిసికట్టుగా పోరాడితేనే దాన్ని ఎదుర్కోగలం. అందరం కలిసి కట్టుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను” అని దలైలామా ఆఫీస్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది.
ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారని, అందరం ఒక కుటుంబం లాగా కలిసి కట్టుగా ఉండే విధంగా ఆలోచించాలని, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలని దలైలామా చెప్పారు.
“ మనుషులంతా ఒకటే. మనం అందరం హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. కష్టాలను అవకాశంగా మార్చుకునే సామర్థ్యం మనందరికీ ఉంది” అని దలైలామా అన్నారు
0 Comments